Thursday, August 7, 2008
మాయల దెయ్యానివే...
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వలచేవో యెందుకు వగచేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో ||మౌనమే||
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ||మౌనమే||
చిత్రం : గుప్పెడు మనసు
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : M S విశ్వనాథన్
గానం : బాలమురళిక్రిష్ణ
Subscribe to:
Posts (Atom)